మరిపెడ,వెలుగు: మరిపెడ పరిధిలో బైకుపై తరలిస్తున్న పదిన్నర కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు తొర్రూర్ డీఎస్పీ సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న రాత్రి సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్డు కాకతీయ కళాతోరణం వద్ద మరిపెడ ఎస్సై తాహిర్ బాబా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఖమ్మం నుంచి మరిపెడ వైపు బైక్ పై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేశారు.
వారి వద్ద తెల్ల బస్తాలో పదిన్నర కేజీల ఎండు గంజాయి దొరికింది. దాని విలువ రెండున్నర లక్షల వరకు ఉంటుందని చెప్పారు. మరిపెడ దుబ్బ తండా కు చెందిన బానోత్ బౌసింగ్, ఖమ్మం ముస్తఫా నగర్ కు చెందిన బత్తుల వెంకటేశ్ ను అరెస్టు చేసి, బైకు సీజ్ చేశామని తెలియజేశారు.