మహిళలకు ఫ్రీగా కుట్టు మెషీన్లు! ..105 మందికి అందజేసిన కొడంగల్ కాంగ్రెస్​ ఇన్​చార్జి

మహిళలకు ఫ్రీగా కుట్టు మెషీన్లు! ..105 మందికి అందజేసిన కొడంగల్ కాంగ్రెస్​ ఇన్​చార్జి

కొడంగల్, వెలుగు: మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ కొడంగల్ సెగ్మెంట్​ ఇన్​చార్జీ తిరుపతిరెడ్డి అన్నారు. కొడంగల్, దుద్యాలకు చెందిన 105 మంది షెడ్యూల్ ​కూలాల మహిళలకు ఉచితంగా కుట్టు మెషీన్లను బుధవారం ఆయన అందజేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం రేవంత్​రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో విరివిగా ఉపాధి, స్వయం ఉపాధికి అవకాశం ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు కొత్త ఆలోచనలతో వృద్ధి సాధించాలని సూచించారు.