ములుగు, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకుంది. గురువారం జరిగిన ఎలక్షన్లలో ములుగు మండలం జీవంతరావుపల్లిలో గ్రామానికి చెందిన కళాలి ఓదెమ్మ (105) ఓటు వేసింది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓదెమ్మను ఆమె కుటుంబ సభ్యులు కలిసి పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. మనుమలు, మునిమనులతో కలిసి ఓదెమ్మ ఓటు వేశారు. శతాధిక వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకొని పలువురికి ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.