కేంద్రం నుంచి రాష్ట్రానికి 10,543 కోట్లు

  • వివిధ స్కీమ్స్ కింద ఇచ్చినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
  • స్టేట్ లో హెల్త్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​ఇంప్రూవ్ మెంట్ కు సాయం చేసినం
  • 1,400 వెంటిలేటర్లు, 2.81 లక్షల పీపీఈ కిట్లు ఇచ్చాం
  • రాజ్యసభలో ఎంపీల ప్రశ్నలకు సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు:  కరోనా టైమ్​లో తెలంగాణకు రూ.10,543.81 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. వివిధ స్కీమ్స్ కింద ఈ మేరకు లబ్ధి చేకూరిందని వెల్లడించింది. కరోనా టైమ్ లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని, వివిధ పథకాల కింద ఎంతమందిని ఆదుకుందని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం సమాధానం ఇచ్చారు. తెలంగాణకు కరోనా ప్యాకేజీ కింద రూ.353.13 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద రూ.523.44 కోట్లు, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్(ఎస్ డీఆర్ఎఫ్) కింద రూ.449 కోట్లు, క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద రూ.179 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. లాక్ డౌన్ టైమ్ లో పీఎంజీకేవై కింద 7, 24, 662 మెట్రిక్ టన్నుల ధాన్యం అందజేయగా, కోటి 80లక్షల 62వేల 980 మంది లబ్ధి పొందారని చెప్పారు. అలాగే 15,804 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను 52లక్షల 68వేల 30మందికి పంపిణీ చేశామన్నారు.

For More News..

కోర్టు టైం వేస్ట్ చేస్తారా?.. 25 వేలు ఫైన్ కట్టండి

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఈ యాసంగి నుంచి సివిల్‌ సప్లయ్స్‌ సెంటర్లు బంద్‌