
కురవి, వెలుగు : 106 కిలోల గంజాయిని పట్టుకొని, నలుగురు అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుమల్‌రావు తెలిపారు. సోమవారం కురవి పీఎస్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. కురవి ఎస్ఐ సతీశ్ సిబ్బందితో ఆదివారం సాయంత్రం ఎస్సారెస్పీ కాల్వ వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఒడిశాకు చెందిన కారు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేయగా గంజాయి దొరికింది.
మరిపెడ మండలం తండా ధర్మారానికి చెందిన బానోతు మహేందర్, ఒడిశాకు చెందిన నర్సింగ్, మండి, చంద్ర మార్కామి, రామచంద్రు మడి ఒడిశాలోని చిత్రకొండలో గంజాయిని కొని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారని చెప్పారు. రూ. 53 లక్షల విలువైన గంజాయితో పాటు నలుగురిని అరెస్ట్ చేసి మారుతి ఆల్టో కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న ఎస్ఐ సతీశ్‌ను ఎస్పీ రాంనాథ్ కేకన్, డీఎస్పీ అభినందించారు.