
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్కమిషనరేట్పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న రూ.3.18 కోట్ల విలువ చేసే సెల్ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. 45 రోజుల్లో వ్యవధిలో మిస్సయిన 1,060 ఫోన్లను గుర్తించి, శుక్రవారం కమిషనరేట్ ఆఫీసులో సైబర్క్రైమ్డీసీపీ ఎల్సీ నాయక్బాధితులకు అప్పగించారు. సెల్ఫోన్చోరీకి గురైనా, పోగొట్టుకున్నా వెంటనే సీఈఐఆర్ పోర్టర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. లేట్చేస్తే ఫోన్ లోని ఫోన్‌పే, గూగుల్‌పే, ఇతర యాప్‌ల నుంచి బ్యాంక్అకౌంట్లను ఖాళీ చేసే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు ఆరు విడతలుగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. క్రైమ్ ఏసీపీ, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది, బాధితులు పాల్గొన్నారు.
మెహిదీపట్నంలో...
ఒక సెల్‌ఫోన్ పోయిందని పోలీసులు రికవరీకి ప్రయత్నిస్తే.. ఓ దొంగ వద్ద మరో 105 మొబైళ్లు పట్టుబడ్డాయి. ఈ కేసు వివరాలను లంగర్ హౌస్ పీఎస్‌లో గోల్కొండ ఏసీసీ సయ్యద్ ఫయాజ్ శుక్రవారం వెల్లడించారు. లంగర్ హౌస్ లోని మొగల్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జలీల్ ఈ నెల 8న తన మొబైల్ పోయిందని స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కాడి అశోక్ ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద మరో105 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.