![సైబరాబాద్‌లో107 మందికి సర్వీస్ మెడల్స్](https://static.v6velugu.com/uploads/2025/02/107-people-awarded-service-medals-in-cyberabad-on-occasion-of-telangana-formation-day_8LC1ag7Thw.jpg)
గచ్చిబౌలి, వెలుగు: ప్రజా భద్రత, నేరాల నివారణలో అంకితభావం, సమగ్రతకు గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించడానికి సేవా పతకాలను అందజేస్తున్నాయని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కమిషనరేట్‌లోని107 మంది సిబ్బందికి ప్రభుత్వం 76 కాంస్య పతకాలు, అతి ఉత్కృష్ట సేవా పతక్ కేటగిరిలో 4 బంగారు పతకాలు, ఉత్కృష్ట సేవా పతక్ కింద 27 వెండి పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిని శుక్రవారం కమిషనరేట్ ఆఫీస్‌లో సీపీ అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రిజం పబ్కాల్పుల ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లకు రివార్డులు
గచ్చిబౌలి ప్రిజం పబ్వద్ద జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ మాదాపూర్ సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి కోలుకున్నారు. ధైర్యంగా కరుడుగట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్‌ను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డితోపాటు కానిస్టేబుళ్లు ప్రవీణ్‌రెడ్డి, వీరస్వామిని శుక్రవారం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అభినందించారు. తన కార్యాలయంలో ముగ్గురికి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో సైబరాబాద్ క్రైమ్డీసీపీ నర్సింహా, ఇతర అధికారులు పాల్గొన్నారు.