వెంకటాపురం, వెలుగు: ప్రమాద స్థలంలో దొరికిన రూ. 50వేలను పోలీసులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయతీ చాటుకున్నారు. ఏఎస్ఐ రామచందర్ తెలిపిన వివరాల ప్రకారం... ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామ సమీపంలో టర్నింగ్ వద్ద మంగళ వారం ఉదయం ఆలెం శ్యామ్ సుందర్ అనే వ్యక్తి బైక్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో తలకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయాలైన శ్యామ్ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో...ప్రమాద స్థలం సమీపంలో రూ 50వేలు, సాంసంగ్ ఫోన్ దొరికాయి. శ్యామ్ ను ఆస్పత్రికి తరలించిన తర్వాత డబ్బులు, ఫోన్ను సిబ్బంది ప్రవీణ్ కుమార్, పైలట్ రవీందర్ పోలీసులకు అప్పగించారు.