పెరుగుతున్న కుక్క కాట్లు..ఏడు నెలల్లో 1084 కేసులు

పెరుగుతున్న కుక్క కాట్లు..ఏడు నెలల్లో 1084 కేసులు

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు : మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి పరిధిలో కుక్క కాట్లు పెరుగుతున్నాయి. గత 7 నెలల్లో సుమారు 1084 కుక్క కాటు కేసులు నమోదైనట్లు ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్కలు చెబుతున్నాయి. పగలూ రాత్రి తేడా లేకుండా, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, కోరుట్ల పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి.

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెల్లుల్ల రోడ్డు, కళనగర్, సుల్తాన్ పుర, ముస్లింపుర, బర్కత్ పుర, చైతన్య నగర్, టీచర్స్ కాలనీ, ఇందిర ప్రియదర్షినికాలనీ, అరపేట, గాజులపేట ఏరియాల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ కరుస్తున్నాయి. దీంతో జనం ఒంటిరిగా బయటకు రావాలంటే జంకుతున్నారు. బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.