కామారెడ్డిటౌన్, వెలుగు: యాసంగి సీజన్‌కు సంబంధించి కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 17,810 మంది రైతుల నుంచి 1,09,489 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. శుక్రవారం చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లి, పొందూర్తి వడ్ల కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు.
అకాల వర్షాలు కురిస్తే వడ్లు తడవకుండా ఉండేందుకు సెంటర్లలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచేలా చూడాలని సిబ్బందికి సూచించారు. కాంట అయిన వెంటనే రైతు వివరాల్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. డీఎస్వో మల్లిఖార్జునబాబు, డీఎం నిత్యానంద్, తదితరులు ఉన్నారు.