కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొండా లక్ష్మణ్ బాపూజీ  ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • తెలంగాణ కోసం ఆయన మంత్రిపదవిని సైతం త్యాగం చేశారు
  • కొండా ల‌‌క్ష్మణ్​ జ‌‌యంతి వేడుక‌‌ల్లో మంత్రులు
  • నివాళులర్పించిన తుమ్మల, జూప‌‌ల్లి, పొన్నం, సీతక్క

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ కోసం మంత్రిపదవిని సైతం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్  బాపూజీ అని, ఆయనను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్  ర‌‌‌‌వీంద్ర భార‌‌తిలో కొండా ల‌‌క్ష్మణ్  బాపూజీ 109వ  జ‌‌యంతి వేడుక‌‌ల‌‌కు ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్వహించింది.

బాపూజీ జ‌‌యంతి ఉత్సవ కమిటీ చైర్మన్, తెలంగాణ మినరల్  డెవలప్ మెంట్  కార్పొరేషన్  చైర్మన్ ఈరవత్రి అనిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి  తుమ్మల నాగేశ్వరరావు, ప‌‌ర్యాట‌‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌‌ల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ, ర‌‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌‌ర్ గౌడ్, పంచాయ‌‌తీ రాజ్ శాఖ మంత్రి  సీత‌‌క్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాపూజీ చిత్రపటానికి వారు పుష్పాంజ‌‌లి ఘ‌‌టించి నివాళుల‌‌ర్పించారు.

అనంతరం మంత్రి జూప‌‌ల్లి మాట్లాడుతూ.. మూడు తరాల ఉద్యమ నేత, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్​ అని అన్నారు. ప‌‌ట్టుద‌‌ల‌‌కు, నిజాయితీకి ఆయన మారుపేరని, తాను న‌‌మ్ముకున్న సిద్ధాంతాల  కోసం జీవితాన్ని త్యాగం చేసిన మ‌‌హాపురుషుడని ఆయ‌‌న కొనియ‌‌డారు. బడుగుబ‌‌ల‌‌హీన వ‌‌ర్గాల కోసం, నేత‌‌న్నల సంక్షేమం కోసం నిరంత‌‌ర త‌‌పించార‌‌ని గుర్తుచేశారు. మలిదశ ఉద్యమంలో ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి ఉద్యమకారుల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు. కొత్తగా  ఏర్పాటైన ఇండియన్  ఇన్‌‌స్టిట్యూట్  ఆఫ్  హ్యాండ్లూమ్ టెక్నాలజీకి  కొండా లక్ష్మణ్  బాపూజీ పేరుపెట్టి గౌరవించుకున్నామ‌‌ని తెలిపారు.

మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం లేదని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని, నేతన్నలను తమ ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యస‌‌భ స‌‌భ్యుడు అనిల్  కుమార్ యాద‌‌వ్, టీజీఎండీసీ చైర్మన్  అనిల్, వ‌‌రంగ‌‌ల్  మేయ‌‌ర్ గుండు సుధారాణి, బీసీ కమిషన్  చైర్మన్   నిరంజన్, కమిషన్  సభ్యులు  తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్  బాల మాయాదేవి,  అఖిల భార‌‌త ప‌‌ద్మశాలి  అధ్యక్షుడు కందగంట్ల స్వామి, వైస్ చైర్మన్  అవ్వారి భాస్కర్, జాజుల శ్రీనివాస్ గౌడ్  త‌‌దితరులు పాల్గొన్నారు.