ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారామపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉల్లిపాయాల లోడు తో వెళ్తున్న లారీని కేవిఅర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుండి వేగంగా ఢీ కొట్టింది.ఈ ప్రమాదం లో బస్సుల్లో ప్రయాణిస్తున్న 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను హుటాహుటిన పెనుబల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ( సెప్టెంబర్ 27, 2024 ) తెల్లవారుజామున పెనుబల్లి మండలం సీతారామపురం వద్ద హైదరాబాదు నుంచి ఏలూరు జిల్లా చెక్కపల్లి కి వెళుతున్న బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది .దీంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.
ఉల్లిపాయల లారీని వెనకవైపు నుంచి బస్సు ఢీకొట్టింది.పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు బస్సు ఎమర్జెన్సీ గేటుని ఓపెన్ చేసి అందులో నుంచి ప్రయాణికులను బయటకి తీశారు. క్షతగాత్రులను పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్పత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో బస్సులో ఓ సంవత్సరం ఉన్న చిన్నారి కూడా ఉంది అయితే ఒక్క గాయం కూడా కాకుండా చిన్నారి సురక్షితంగా పోలీసులు బస్సులో నుండి బయటికి తీశారు.