గ్రేట్​: చిన్నారి సాయి సింధు రూ. 3 వేలు వరద సాయం

 గ్రేట్​:  చిన్నారి సాయి సింధు రూ. 3 వేలు వరద సాయం

తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహబూబూబాద్​ లో ఓ చిన్నారి సీఎం రేవంత్​ కు తన కిడ్డీ బ్యాంకు నుంచి రూ. 3 వేలను వరద సహాయనిధిని అందించింది. తెలంగాణలో భారీ వర్షాలు జనజీవనాన్ని కకావికలం చేస్తున్నాయి. సర్వం కోల్పోయి గుక్కెడు మంచి నీళ్లు, ఆహారం కోసం దీనంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరాశ్రయులకు సహాయం అందించేందుకు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి.  

మహబూబాబాద్​ జిల్లాలో పదో తరగతి చదువుచున్న ముత్యాల సాయి సింధు  సీఎం రిలీఫ్​ఫండ్​కు రూ. 3 వేల రూపాయిలు అందించింది.   ఈ మొత్తాన్ని వరద బాధితులకు సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్​ అన్నారు.  చిన్నవయస్సులోనే.. ఎంతో ఉదారతను ప్రదర్శించిన సాయి సింధును స్థానికులు అభినందిస్తున్నారు.  

ALSO READ : మేడ్చల్ పెద్ద చెరువు కట్ట కుగింది

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 21 మంది ప్రాణాలు పోయాయి. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించింది. వరదల కారణంగా అనేక గ్రామాలలో పరిస్థితి దారుణంగా ఉన్నాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.