మర్పల్లి బడి మర్చిపోలేని జ్ఞాపకం

మర్పల్లి బడి మర్చిపోలేని జ్ఞాపకం

వికారాబాద్ ​జిల్లా మర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ లో 2003లో పదో తరగతి పూర్తిచేసిన వారంతా శనివారం కలుసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకుని, స్కూల్ ​డేస్​ను గుర్తుచేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లను ఘనంగా సన్మానించారు. 

21 ఏండ్ల తర్వాత చదువుకున్న స్కూలులో అంతా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నాటి టీచర్లు మల్లయ్య, కృష్ణారెడ్డి, ఆనందం, భాస్కర్, రాజ ప్రసన్న, సుజాత, భవానీ, పూర్వ విద్యార్థులు ఎన్.వెంకటరామ్, టి.రాఘవేందర్, యు.మహేశ్, మన్నెపల్లి బస్వరాజ్, నర్సింహులు, సునీల్, ప్రవీణ్ గౌడ్, గఫార్, కార్తిక్, జ్యోత్స్న, సంధ్య, లత, స్వాతి, శివలీల, సంగీత పాల్గొన్నారు. 

- వెలుగు, వికారాబాద్