
ఈ మద్య గుండెపోట్లు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎపుడు ఎవరికి వస్తుందో అర్థం కావట్లే..కూర్చున్న చోటనే కుప్పకూలుతున్నారు.
లేటెస్ట్ గా గుండెపోటుతో టెన్త్‌క్లాస్ స్టూడెంట్ మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనిధి కామారెడ్డిలో ప్రైవేటు స్కూల్లో టెన్త్‌క్లాస్ చదువుతుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న స్కూల్‌కు వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకులింది.
పాఠశాల ఉపాధ్యాయుడు, పేరెంట్స్ ఆమెను హాస్పిటల్‌కు తరలించే లోపే మార్గమధ్యంలోనే చనిపోయిన్నట్లు డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్లో ఆమెకు సీపీఆర్చేసిన ఫలితం లేకపోయింది. స్టూడెంట్మృతిపై గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని మృతి పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.