బిగ్ బాస్ ఓటింగ్లో ట్విస్ట్.. డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్

బిగ్ బాస్ ఓటింగ్లో ట్విస్ట్.. డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో పదవ ఎలిమినేషన్ ను రంగం సిద్ధమైంది. గతవారం అనూహ్యంగా తేజ(Teja) ఇంటినుండి బయటకు వచ్చేశాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో శివాజీ,యావర్,రాతిక,గౌతమ్,భోలే ఉన్నారు. అందరు టాప్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్ పై ఆసక్తిపెరిగింది. 

ఇక విషయానికి వస్తే.. ఎప్పటిలాగే శివాజీ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నారు. ఈ వారం ఫ్యామిలీ వీక్ లో తన కొడుకు రావడంతో ఆయనకు మరింత పాజిటీవ్ పెరిగింది. ఇక రెండో స్థానంలో గౌతమ్ ఉన్నారు. ఈవారం తన తల్లి ఇంట్లోకి రావడంతో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక మూడో స్థానంలో భోలే ఉన్నారు. 

ఇక చివరి రెండు స్థానాల్లో రతికా యావర్ నిలిచారు. ఈ ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. రతికాకు ముందు నుండే ఉన్న నెగిటివిటీ కంటిన్యూ అవుతుండగా.. రాతిక రీ ఎంట్రీ తరువాత యావర్ గేమ్ చాలా వరకు డిస్టర్బ్ అయ్యిదనే చెప్పాలి. ఎప్పుడు రతికాతోనే ఉండటం, శివాజీతో దూరంగా ఉండటంతో అది అతనికి బయట నెగిటివిటీ ఏర్పడింది. 

ఈ ఇద్దరిలో చూసుకుంటే ఈవారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ యావర్ కె ఎక్కువగా కనిపిస్తున్నాయి. వోటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది యావర్ కి. దీంతో ఈ వారం యావర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.