11 ఏండ్లలో 11 అబద్ధాలు: ప్రధాని మోడీపై ఖర్గే ఫైర్

11 ఏండ్లలో 11 అబద్ధాలు: ప్రధాని మోడీపై ఖర్గే ఫైర్

కలబుర్గి (కర్నాటక): ప్రధాని మోదీ దేశానికి అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.11 ఏండ్ల అధికారంలో 11 అబద్ధాలు చెప్పారని ఆరోపణలు చేశారు.  శనివారం కర్నాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోదీ ఇచ్చిన హామీలను విమర్శించారు. “ప్రధాని మోదీ 11 ఏండ్లలో 11 పెద్ద అబద్ధాలు చెప్పారు. మొదటి అబద్ధం.. విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ చేస్తామని చెప్పడం. 

రెండో అబద్ధం ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇవ్వడం. అయినప్పటికీ, యువత మోదీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో..? నాకు ఇంకా తెలియదు.  కులం, మతం ఆధారంగా ఇస్తున్నారా..? నాకైతే అర్థం కావడం లేదు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వరు” అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.