హైదరాబాద్: తెలంగాణలో అది కూడా హైదరాబాద్లో 11 HMPV కేసులు నమోదయినట్లు సిటీలోని మణి మైక్రోబయోలాజికల్ ల్యాబొరేటరీ వెల్లడించింది. అంటే.. 2024 డిసెంబర్లోనే (గత నెలలోనే) HMPV వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేసింది. మణి మైక్రోబయాలాజికల్ ల్యాబొరేటరీలో రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడిన 258 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఇందులో.. 205 మందికి ఎగువ శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది.
అంతేకాదు.. ఈ 205 మందిలో 11 మందికి హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చినట్లు సదరు ల్యాబొరేటరీ తాజాగా వెల్లడించింది. మణి మైక్రోబయోలజీ అనే పేరుతో హైదరాబాద్లో నడుస్తున్న ఒక ప్రైవేట్ ల్యాబొరేటరీ విడుదల చేసిన Respiratory Viral Pneumonia Panel Dataలో 11 HMPV వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఉంది. అయితే.. కంగారు పడాల్సిన పనేమీ లేదని, HMPV పాజిటివ్ వచ్చిన 11 మంది కోలుకుని డిశ్చార్జ్ కూడా అయినట్లు సదరు ల్యాబొరేటరీ తెలిపింది.
Also Read :- తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ఆందోళన అక్కర్లేదని ఐసీఎంఆర్ ఇప్పటికే తెలిపింది. ఈ వైరస్ పాతదేనని ఇప్పటికే ఇండియాతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని స్పష్టం చేసింది. దేశంలో ఇన్ ఫ్లూయెంజా, తీవ్ర శ్వాసకోశ వ్యాధుల లాంటి కేసులు అసాధారణ రీతిలో ఏమీలేవని పేర్కొంది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని చెప్పింది. వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందని పేర్కొంది. చైనాలో వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటా నిమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు మన దేశంలోనూ నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా ఏడు కేసులు రికార్డయ్యాయి.
🚨🚨11 HMPV CASES IN HYDERABAD🚨🚨#HMPV #HMPVinIndia #hmpvvirus #HMPVCase #Hyderabad #TelanganaNews #hyderabadnews #BreakingNews pic.twitter.com/eEE6hxzLAr
— Zaffer Abedi (@zaffer_abedi) January 8, 2025