చెన్నూరు, వెలుగు : చెన్నూరు పట్టణ సమీపంలోని బతుకమ్మ వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు. ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగించామన్నారు.