
గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోని11 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమన్గల్సీఐగా పనిచేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను ఆర్జీఐ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా, ఆర్జీఐ ట్రాఫిక్ఇన్స్పెక్టర్గా ఉన్న కారంపురి రాజును శామీర్‌పేట డీఐగా బదిలీ చేశారు. జగద్గిరిగుట్ట డీఐ అంజయ్యను రాజేంద్రనగర్జోన్ఎస్ఓటీ ఇన్స్పెక్టర్గా, శామీర్‌పేట డీఐ చంద గంగాధర్ ను కడ్తాల్ఇన్స్పెక్టర్గా, పేట్బషీరాబాద్ఇన్స్పెక్టర్సుంకరి విజయ్ ను చందానగర్ ఇన్స్పెక్టర్గా, కడ్తాల్ఇన్స్పెక్టర్శివ ప్రసాద్ ను సైబర్క్రైమ్ఇన్స్పెక్టర్గా ట్రాన్స్ఫర్చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్రమనారెడ్డిని షీ టీం ఇన్స్పెక్టర్గా, సైబర్ క్రైమ్ఇన్స్పెక్టర్అజయ్కుమార్ ను పేట్బషీరాబాద్డీఐగా, చందానగర్ఇన్స్పెక్టర్ పాలవెల్లిని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా, సైబర్ క్రైమ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డిని జగద్గిరిగుట్ట డీఐగా బదిలీ చేశారు. తక్షణమే ఆయా పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.