ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 11 ఐపీఓలు

ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు 11 ఐపీఓలు

న్యూఢిల్లీ: ఈ వారం మరో 11 కంపెనీల ఐపీఓలు ఓపెన్ కానున్నాయి.   ఇందులో  రెండు మెయిన్ బోర్డ్ ఐపీఓలు ఉన్నాయి. మరోవైపు 14 కంపెనీల షేర్లు ఈ వారం మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ కానున్నాయి.  

1. మన్బా ఫైనాన్స్ ఐపీఓ  ఈ నెల 23 న ఓపెనై 25 న ముగియనుంది. ఒక్కో షేరుని రూ. 114–120 రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముతోంది. 

2. కేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్ హీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ రిఫ్రిజిరేషన్  పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 342 కోట్లు సేకరించాలని చూస్తోంది. కంపెనీ ఐపీఓ ఈ నెల 25  న ఓపెనై 27 న ముగుస్తుంది. ఒక్కో షేరుని రూ.209–220 ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్ముతున్నారు. 

3. వోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3డీ ఇండియా, రాపిడ్ వాల్వ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఇండియా) ఐపీఓలు ఈ నెల 23–25 మధ్య ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి.    వోల్ 3డీ షేర్లు రూ.142–150 రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, రాపిడ్ వాల్వ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు రూ.210–222 రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి.

4. టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎరా ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూనిలెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, థింకింగ్ హాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పబ్లిక్ ఇష్యూలు ఈ నెల 25 న ఓపెనై 27 న ముగుస్తాయి. 

5. దివ్యధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సహస్రా ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోర్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటో ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓలు ఈ నెల 26–30 మధ్య ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా,    సాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్స్ ఐపీఓ ఈ నెల 27 న ఓపెన్ కానుంది. 

6.  ఇప్పటికే ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కలాన్ ఇస్పత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పబ్లిక్ ఇష్యూ ఈ నెల 23 న క్లోజ్ అవ్వగా, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీనిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏవి అన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓలు ఈ నెల 24 న ముగుస్తాయి. 

7. వెస్టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారియర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా, ఆర్కేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నార్తర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్క్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 24 న మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అవుతాయి. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాపులర్ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,   దక్కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్విరోటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెలట్రో, ఓసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డివైజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు ఈ నెల 24 న, పారామౌంట్ స్పెషాలిటీ ఫోర్జింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు ఈ నెల 25 న మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. కలాన్ ఇస్పత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ నెల 26 న, ఏవి అన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫీనిక్స్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ రిటైల్, బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు ఈ నెల 27 న లిస్టింగ్ కానున్నాయి.