ఈ వారం 11 ఐపీఓలు ఓపెన్‌‌‌‌‌‌‌‌

ఈ వారం 11 ఐపీఓలు ఓపెన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఈ వారం ఏకంగా 11 కంపెనీల ఐపీఓలు ఇన్వెస్టర్లు ముందుకు రానున్నాయి. విశాల్ మెగా మార్ట్‌‌‌‌‌‌‌‌, టీపీజీ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌కు వాటాలున్న సాయి లైఫ్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌, ఫిన్‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీ వన్‌‌‌‌‌‌‌‌ మొబిక్విక్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌,  ఇన్వెంచర్స్‌‌‌‌‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్, బ్లాక్‌‌‌‌‌‌‌‌స్టోన్‌‌‌‌‌‌‌‌కు వాటాలున్న డైమండ్‌‌‌‌‌‌‌‌ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమాలాజికల్‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ (ఇండియా)  కంపెనీలు మొయిన్‌‌‌‌‌‌‌‌బోర్డ్ ఐపీఓల ద్వారా సుమారు రూ. 18,350 కోట్లు సేకరించాలని  చూస్తున్నాయి. ఈ వారం మొత్తం ఐదు మెయిన్ బోర్డ్‌‌‌‌‌‌‌‌ ఐపీఓలు, ఆరు  ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రానున్నాయి. ధనలక్ష్మీ క్రాప్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌, టాప్‌‌‌‌‌‌‌‌ ది కాయిన్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌, జంగిల్‌‌‌‌‌‌‌‌ క్యాంప్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా, సుప్రీం ఫెసిలిటీ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, పర్పుల్‌‌‌‌‌‌‌‌ యూనిటెడ్‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌, యాష్‌‌‌‌‌‌‌‌ హైవోల్టేజ్‌‌‌‌‌‌‌‌లు  ఎస్‌‌‌‌‌‌‌‌ఎంఈ ఐపీఓల ద్వారా రూ.150 కోట్లు సేకరించనున్నాయి.

 ఈ ఏడాదిలో ఇప్పటివరకు 78 మెయిన్‌‌‌‌‌‌‌‌బోర్డ్ ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. ఇందులో హ్యుందాయ్‌‌‌‌‌‌‌‌ మోటార్ ఇండియా, స్విగ్గీ, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ, బజాజ్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటివి ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.1.4 లక్షల కోట్లను సేకరించాయి. కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో 57 మెయిన్‌‌‌‌‌‌‌‌బోర్డ్‌‌‌‌‌‌‌‌ ఐపీఓలు రూ.49,436 కోట్లను సేకరించాయి.   విశాల్ మెగా మార్ట్‌‌‌‌‌‌‌‌, సాయి లైఫ్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌, మొబిక్విక్ ఐపీఓలు ఈ నెల 11 న ఓపెనై, 13 న ముగుస్తాయి. మూడు రోజుల పాటు ఓపెన్‌‌‌‌‌‌‌‌లో ఉండే ఇన్వెంచర్స్‌‌‌‌‌‌‌‌  నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌ ఐపీఓ ఈ నెల 12న,  ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఐపీఓ  ఈ నెల 13న ఓపెన్ అవుతాయి.