మణిపూర్‌‌‌‌లో ఎన్​కౌంటర్..​11 మంది కుకీ మిలిటెంట్లు మృతి

మణిపూర్‌‌‌‌లో ఎన్​కౌంటర్..​11 మంది కుకీ మిలిటెంట్లు మృతి

న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌‌‌‌లో భద్రతాదళాలతో జరిగిన ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌లో 11 మంది అనుమానిత కుకీ మిలిటెంట్లు మృతిచెందారు. కుకీ టెర్రరిస్టులు జిరిబామ్‌‌‌‌లోని పోలీస్ స్టేషన్‌‌‌‌పై కాల్పులకు తెగబడడంతో ఎన్‌‌‌‌కౌంటర్ జరిగినట్లు సీఆర్​పీఎఫ్​వర్గాలు తెలిపాయి. 

సోమవారం మధ్యాహ్నం జిరిబామ్ జిల్లాలోని బోరోబెక్రాలోని పోలీసు స్టేషన్​పై అనుమానిత కుకీ టెర్రరిస్టులు రెండు వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్ పక్కనే నిర్వాసితుల శిబిరం కూడా ఉంది. అప్రమత్తమైన పోలీసులు, సీఆర్​పీఎఫ్ బలగాలు వారిపై ఫైరింగ్ స్టార్ట్ చేశాయి. కొద్ది సేపు భీకరంగా కాల్పులు కొనసాగాయి. ఈ ఎన్​కౌంటర్​లో 11 మంది కుకీ టెర్రరిస్టులు చనిపోయారు. పలువురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు కూడా గాయపడ్డారు.