హుస్నాబాద్, వెలుగు : ఇంటి డాబాపై ఐరన్టేపుతో ఆడుకుంటుండగా పైన ఉన్న కరెంటు వైర్లను తాకడంతో షాక్ కొట్టి ఓ బాలుడు చనిపోయాడు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ విషాద ఘటన జరిగింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం హుస్నాబాద్‌లోని బుడగజంగాల కాలనీకి చెందిన సయ్యద్ షంషీర్ ఆటో డ్రైవర్. అతని భార్య అనీఫా బేగం కూలీ. వారికి కొడుకు సాదిక్అన్వర్(6), కూతురు రిగ్జానా(9) ఉన్నారు. ఆదివారం షంషీర్, అనీఫా బేగం పనికి వెళ్లగా.. సాదిక్అన్వర్ మారుతీనగర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి డాబాపై ఐరన్ టేపుతో ఒక్కడే ఆడుకుంటున్నాడు. భవన నిర్మాణాల్లో గోడల పొడవును కొలిచే ఐరన్ టేపుకు ఉండే బటన్‌ను నొక్కడంతో ఇంటి పైన ఉన్న 11 కేవీ కరెంటు వైర్లను టేపు తాకింది. దీంతో బాలుడికి షాక్ తగిలి అక్కడికక్కడే కాలిపోయాడు.
ఇంటి డాబాపై మంటలు రేగడంతోపాటు వాసన రావడంతో ఇంట్లో ఉన్న హైదర్ వచ్చి చూశాడు. అప్పటికే సాదిక్ మంటల్లో కాలిపోతుండడంతో కేకలు వేశాడు. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కరెంటు సరఫరా నిలిపివేశారు. కాగా ఇండ్ల పైనున్న కరెంటు వైర్లను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వైర్లు దూరంగా జరిపి ఉంటే తన మనవడు చనిపోయేవాడుకాదని హైదర్ అన్నాడు. మృతుడి తండ్రి షంషీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హుస్నాబాద్ ఎస్సై మహేశ్ తెలిపారు. ఇంటి డాబాపై ఐరన్టేపుతో ఆడుకుంటుండగా పైన ఉన్న కరెంటు వైర్లను తాకడంతో షాక్ కొట్టి ఓ బాలుడు చనిపోయాడు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ విషాద ఘటన జరిగింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం హుస్నాబాద్‌లోని బుడగజంగాల కాలనీకి చెందిన సయ్యద్ షంషీర్ ఆటో డ్రైవర్. అతని భార్య అనీఫా బేగం కూలీ. వారికి కొడుకు సాదిక్అన్వర్(6), కూతురు రిగ్జానా(9) ఉన్నారు.
ఆదివారం షంషీర్, అనీఫా బేగం పనికి వెళ్లగా.. సాదిక్అన్వర్ మారుతీనగర్‌లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి డాబాపై ఐరన్ టేపుతో ఒక్కడే ఆడుకుంటున్నాడు. భవన నిర్మాణాల్లో గోడల పొడవును కొలిచే ఐరన్ టేపుకు ఉండే బటన్‌ను నొక్కడంతో ఇంటి పైన ఉన్న 11 కేవీ కరెంటు వైర్లను టేపు తాకింది. దీంతో బాలుడికి షాక్ తగిలి అక్కడికక్కడే కాలిపోయాడు. ఇంటి డాబాపై మంటలు రేగడంతోపాటు వాసన రావడంతో ఇంట్లో ఉన్న హైదర్ వచ్చి చూశాడు. అప్పటికే సాదిక్ మంటల్లో కాలిపోతుండడంతో కేకలు వేశాడు. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. వారు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు కరెంటు సరఫరా నిలిపివేశారు. కాగా ఇండ్ల పైనున్న కరెంటు వైర్లను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వైర్లు దూరంగా జరిపి ఉంటే తన మనవడు చనిపోయేవాడుకాదని హైదర్ అన్నాడు. మృతుడి తండ్రి షంషీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హుస్నాబాద్ ఎస్సై మహేశ్ తెలిపారు.