బషీర్ బాగ్, వెలుగు: రాంకోఠిలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత మృతికి కారణమైన అయాన్ మెడికల్ కాలేజీ యాజమాన్యంపై చట్ట పరమైన చర్యలు తీసుకొని , ఆమె కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని హిమాయత్ నగర్ కార్పొరేటర్ జి. మహాలక్ష్మిగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక సంఘం నేతలు కాలేజీ మేనేజ్ మెంట్ తో మాట్లాడగా.. మృతురాలి కుటుంబానికి రూ. 11 లక్షలు నష్టపరిహారం ఇస్తామని హామీని ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.