ఆ రూ.40 వేల మోదీ డబ్బులతో.. భర్తలను వదిలేసి ప్రేమికులతో పారిపోయిన మహిళలు

ఆ రూ.40 వేల మోదీ డబ్బులతో.. భర్తలను వదిలేసి ప్రేమికులతో పారిపోయిన మహిళలు

అమ్మో.. అమ్మో.. ఇలాంటి ఘోరాలు ఎప్పుడైనా చూశామా అన్నట్లు ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఈ మహిళల నిర్వాకం చూస్తే.. పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల సాకారం కోసం.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తుంది. ఇలా మొదటి విడత కింద 40 వేల రూపాయల డబ్బు.. ఆ మహిళల బ్యాంక్ ఖాతాలో జమ అయిన వెంటనే.. 11 మంది మహిళలు.. తమ భర్తలను వదిలేసి.. ప్రేమికులతో ఇంటి నుంచి పారిపోయారు. ఇంటి నిర్మాణంపై ఎంక్వయిరీ చేసిన అధికారులకు.. అసలు విషయం తెలిసి అవాక్కవుతున్నారు.. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాకు చెందిన 11 మంది మహిళలు PMAY పథకం కింద ప్రభుత్వం నుంచి మొదటి విడత మొత్తం  రూ. 40 వేలు  తీసుకుని, వారి భర్తలను వదిలేసి..లవర్స్ తో  పారిపోయారు. ప్రేమికులతో పారిపోయిన మహిళల  భర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read:ఇంజనీరింగ్ అద్భుతం: రోడ్డు, మెట్రో ట్రాక్.. టూ ఇన్ వన్ ఫ్లైఓవర్..

ఇటీవల మహారాజ్‌గంజ్ జిల్లాలో దాదాపు 2,350 మంది లబ్ధిదారులు PMAY పథకం కింద డబ్బును అందుకున్నారు. లబ్ధిదారులు తుతిబరి, షీత్లాపూర్, చాటియా, రాంనగర్, బకుల్ దిహా, ఖస్రా, కిషున్‌పూర్  మేధౌలి గ్రామాలకు చెందినవారు ఉన్నారు. లేటెస్ట్ గా 11 మంది మహిళలు డబ్బులతో  జంప్ కావడంతో   లబ్ధిదారులకు సెకండ్ ఇన్ స్టాల్ మెంట్  నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

గతేడాది సేమ్ సీన్

పీఎంఏవై పథకం కింద డబ్బులు అందక నలుగురు మహిళలు  తమ ప్రేమికులతో కలిసి ఇళ్ల నుంచి పారిపోయిన ఘటనలు ఉత్తరప్రదేశ్‌లో గతేడాది కూడా జరిగాయి.  వారి బ్యాంకు అకౌంట్లో 50 వేలు పడిన  వెంటనే నలుగురు మహిళలు పారిపోయారు.  ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో అధికారులు గమనించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  ఇంటి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులు  ఆదేశించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో  వాళ్ల భర్తలకు జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. 

పీఎం ఆవాస్ యోజన అంటే?

PMAY పథకం కింద, పేద ,  మధ్యతరగతి కుటుంబాలు శాశ్వత ఇంటిని నిర్మించుకోవడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తోంది.  కుటుంబ ఆదాయాన్ని బట్టి  ప్రభుత్వం రూ.2.5 లక్షల వరకు సబ్సిడీని కూడా అందిస్తుంది. పీఎం ఆవాస్ యోజన కింద ఈ డబ్బును వేరే చోట ఉపయోగించినట్లయితే, వారి నుండి కూడా డబ్బు రికవరీ చేయబడుతుందనే నిబంధన ఉంది.