- దేవాదాయ శాఖలో ఆరేండ్లుగా పెండింగ్.. మంత్రి చొరవతో ప్రక్రియ పూర్త
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో11 మంది అధికారులకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)లుగా ప్రమోషన్ లభించింది. వీరిలో ముగ్గురు గ్రేడ్ 3 ఈవోలు.. గ్రేడ్ 1 ఈవోలుగా ప్రమోషన్ పొందారు. 8 మంది గ్రేడ్ 3 ఈవోలకు గ్రేడ్ 2 ఈవోలుగా పదోన్నతి లభించింది. సీనియారిటీ లిస్టు పూర్తికాగానే మరికొన్ని రోజుల్లో మరో11 మంది ఈవోలకు పదోన్నతి కల్పించనున్నారు. గత ఆరు ఏండ్లుగా సర్వీస్ రూల్స్, సీనియారిటీ లిస్ట్ రెడీ చేయక పోవడంతో ఈ ప్రక్రియ పెండింగ్ లో కొనసాగింది.
తాజాగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడంతో ప్రమోషన్ లు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ టెంపుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బేతి రంగారెడ్డి మంత్రి సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. వినతిపత్రం అందజేసిన తర్వాత మంత్రి నెలరోజుల్లోనే స్పందించి తమ సమస్యను పరిష్కరించారని చెప్పారు.