ఢిల్లీ పోలీసులకు రూ.11 వేల 180 కోట్లు

ఢిల్లీ పోలీసులకు రూ.11 వేల 180 కోట్లు

దేశ రాజధాని ఢిల్లీలో విధులు నిర్వహించే పోలీసు శాఖకు తాజా బడ్జెట్ లో రూ.11,180.33 కోట్లు, ప్రధానికి కాపలాకాసే స్పెషల్  ప్రొటెక్షన్  గ్రూప్ కు రూ.506.32 కోట్లు కేటాయించారు. బార్డర్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్  మేనేజ్ మెంట్ కు రూ.3,756.51 కోట్లు, పోలీసుల మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం రూ.3,152.36 కోట్లు, మహిళల భద్రతకు రూ.1,105 కోట్లు కేటాయించారు.

హోం శాఖ స్పాన్సర్  చేసే వివిధ ప్రాజెక్టులు, పథకాలకు రూ.9,305.43, భద్రతాపరమైన ఖర్చుల కోసం రూ.3,199.62 కోట్లు, వైబ్రాంట్  విలేజెస్  ప్రోగ్రాం కోసం రూ.1,050 కోట్లు కేటాయించారు. కేంద్ర కేబినెట్ కు రూ.1,248.91 కోట్లు కేటాయించారు. 

ఇందులో మంత్రిమండలి, కేబినెట్  సెక్రటరీ, ప్రధాన మంత్రి కార్యాలయం, ప్రభుత్వ ఆతిథ్యం వంటి ఖర్చలు ఉంటాయి. ఇక డిజస్టర్  మేనేజ్ మెంట్, రిలీఫ్​ అండ్  రిహాబిలిటేషన్, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంట్స్ ఇన్  ఎయిడ్  కు రూ.6,458 కోట్లు కేటాయించారు. సేఫ్  సిటీ ప్రాజెక్టుకు రూ.214.44 కోట్లు, నేషనల్  ఫోరెన్సిక్  సైన్స్  యూనివర్సిటీకి రూ.80 కోట్లు, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీకి రూ.90 కోట్లు కేటాయించారు.కాగా.. ఫిబ్రవరిలో ప్రకటించిన తాత్కాలిక బడ్జెట్​లో హోంశాఖకు రూ.2,02,868.70 కోట్లు కేటాయించారు.