హైదరాబాద్‌లో 11 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్

హైదరాబాద్‌లో 11 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో పబ్లిక్ న్యూసెన్స్ కు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్లను అరెస్ట్ చేశారు. రోడ్లపై వెళ్తున్న వారికి ఇబ్బందులు కలిగిస్తున్న 11 మంది ట్రాన్స్‌జెండర్లను సైబరాబాద్‌లోని ఉమెన్ & చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ (డబ్ల్యు అండ్ సిఎస్‌డబ్ల్యు) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు స్పెషల్ టీమ్స్ ఆకస్మిక దాడులు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పాటలు పాడుతూ అసభ్యంగా ప్రవర్తించిన 11 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.