నగరంలో 11 మంది ట్రాన్స్​జెండర్ల అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న 11 మంది ట్రాన్స్ జెండర్లను  పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి ఐటీ కారిడార్​లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఐకియా షాపింగ్ మాల్, కైతలాపూర్ బ్రిడ్జి, బొటానికల్ గార్డెన్ రోడ్డు వద్ద వాహనదారులను అసౌకర్యానికి గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న11 మంది ట్రాన్స్ జెండర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.