
అదృష్టమంటే నిజంగా వీళ్లదేనని చెప్పాలి. 11 మంది కలిసి రూ. 250 పెట్టి టికెట్ కొంటే ఏకంగా రూ. 10 కోట్ల లాటరీ తగిలింది. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పరప్పన్ గడి మున్సిపాలిటీలో హరిత కర్మ సేన తరుపున కొందరు పేద మహిళలు పనిచేస్తున్నారు. వీరు భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు.
అయితే ఇందులో పనిచేసే 11 మంది మహిళలు డబ్బులు జమ చేసుకుని రూ. 250 పెట్టి లాటరీ టికెట్ కొనేందుకు వెళ్లారు. కాగా టికెట్ ధర రూ.250. అంత డబ్బు వారి దగ్గరలేదు. దీంతో అందరికి దగ్గర కలిపినా రూ.25 మాత్రమే వచ్చింది. దీంతో అప్పు అడగాలని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా 250 రూపాయలు వసూలు చేసి టికెట్ కొన్నారు.
AsloRead:మోస్ట్ వాంటెడ్ కెప్టెన్ మిల్లర్.. టీజర్ రెస్పాన్స్ అదుర్స్
కేరళ లాటరీ డిపార్ట్మెంట్ గత బుధవారం డ్రా తీయగా.. లక్కీగా వీరు కొన్న టికెట్ కు రూ. 10 కోట్ల లాటరీ తగిలింది. దీంతో వారి అనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ డబ్బుతో తమ జీవితాలు మారుతాయని మహిళలు అంటున్నారు. ఈ డబ్బుతో ఇళ్ల నిర్మాణానికి, పిల్లల చదువులకు, అప్పులు తీరుస్తామని చాలా మంది మహిళలు తెలిపారు. ఆ మొత్తాన్ని అందరూ సమానంగా పంచుకుంటామని వారు తెలిపారు.