జగద్గిరిగుట్టలో  విషాదం.. ఈతకు వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్ట లెనిన్ నగరంలో  విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు  వెళ్లి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  మే 28న మధ్యాహ్నం నలుగురు స్నేహితులు క్రికెట్ ఆడి ఈతకు వెళ్లారు.  ఈత రాకపోవడంతో మనోజ్ నీళ్లలో మునిగి చనిపోయాడు. మిగతా ముగ్గురు  బండ రాయి, చెట్ల కొమ్మలను పట్టుకుని ఒడ్డుకు చేరారు. 

అయితే మనోజ్ విషయం ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో  కుక్కులు వెంట బడ్డాయని అబద్ధం చెప్పారు మనోజ్ ఫ్రెండ్స్. రాత్రి వరకు మనోజ్ జాడ లేకపోవడంతో స్థానికులు  చుట్టుపక్కల  గాలించారు. గట్టిగా నిలదీయడంతో చెరువులో ఈతకు వెళ్లామని  మనోజ్ స్నేహితుడు  అహద్ అసలు విషయం చెప్పాడు. అప్పటికే చీకటి కావడంతో ఇవాళ చెరువులో గాలింపు చేపట్టగా మనోజ్ మృతదేహం బయట పడింది.