దల్లేవాల్​కు మద్దతుగా మరో 111 మంది దీక్ష

చండీగఢ్: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా బుధవారం 111 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. నల్ల దుస్తులు ధరించి నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఖనౌరి బార్డర్​లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పంజాబీ రైతు దల్లేవాల్ 50 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటుండడంతో ఆరోగ్యం క్షీణిస్తోంది, ఆయన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆయనకు సంఘీభావంగా 111 మంది రైతులు నిరాహార దీక్షకు కూర్చున్నారు.