వినా డెల్ మార్: లాటిన్ అమెరికా కంట్రీ చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. రెండ్రోజుల క్రితం మొదలైన అగ్నికీలలు, అడవులను దాటి నగరాలను చుట్టుముడుతున్నాయి. ఇప్పటి వరకు మంటల్లో సుమారు 112మందికి పైగా మృతిచెందారు. వందలాది మందికి గాయాలయ్యాయి. వైల్డ్ ఫైర్ ను ఆర్పేందుకు ఫైరింగ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కార్చిచ్చు ప్రభావం ఉన్న నగరాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు అధికారులు. వినా డెల్ మార్ కు తూర్పువైపున ఉన్న ప్రాంతాల్లోకి మంటలు వేగంగా వ్యాపించాయి. ఇక్కడి బొటానికల్ గార్డెన్ అగ్నికి ఆహుతైంది. దట్టమైన పొగతో సమీప ప్రాంతాల వాసులు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కార్చిచ్చు ప్రభావం ఉన్న నగరాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు అధికారులు. క్విల్పీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 1100 ఇళ్లు కాలి బూడిదయ్యాయని చెప్పారు. దాదాపు 16 వందల మంది పూర్తిగా నిరాశ్రయులయ్యారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గాలులు, తేమ కారణంగా కార్చిచ్చు మరింత వేగంగా విస్తరిస్తున్నది. సెంట్రల్, దక్షిణ చిలీలో 92 చోట్ల మంటలు వ్యాపించాయి. వాల్పారా ప్రాంతంలో మంటలు భీకరంగా కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో కొన్నివేల మందిని ఖాళీ చేయించాం. మంటలు ఆర్పేందుకు వెళ్తున్న ఫైరింజన్లకు దారివ్వండి. కిల్పు, విల్లా ఆలెమానా పట్టణాల్లో 19,770 ఎకరాలు అగ్నికీలలకు బూడిదయ్యాయి. అలాగే పలు ఇండ్లు, వాహనాలు, వ్యాపార కేంద్రాలు నాశనమయ్యాయి” అని బోరిక్ తెలిపారు. కాగా, ఈ ఏడాది దక్షిణ అమెరికాలో ఎల్ నినో కారణంగా కరువు సంభవించింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా పెరిగాయి.అలాగే డ్రై వెదర్ వల్ల కొలంబియాలో గత నెలలో సంభవించిన కార్చిచ్చు ధాటికి 42 వేల ఎకరాలు ఆహుతయ్యాయి.