కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 114 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం ప్రజలు అందజేసిన దరఖాస్తులు ఆయా శాఖల ఆఫీసర్లు సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో చందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో సురేందర్, ఏవో మన్సూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
లోన్ల రెన్యూవల్‌పై ఫోకస్ చేయండి
పంట రుణమాఫీ జరిగిన రైతులకు లోన్ల రెన్యూవల్ విషయంలో ఆఫీసర్లు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. ఎస్బీఐ, డీసీసీబీ లోన్ రెన్యూవల్ శాతం మరింతగా పెంచాలన్నారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, ఎల్డీఎం రవికాంత్, బ్యాంక్ ఆఫీసర్లు సుమమాల, శాండిల్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.