ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి

ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌లో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌)లో ఏప్రిల్‌‌ నెలలో 1.14 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు ప్లాంట్‌‌ చీఫ్‌‌ జనరల్‌‌ మేనేజర్‌‌ సుధీర్‌‌ కుమార్‌‌ ఝూ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇందులో తెలంగాణకు 35,332.65 టన్నులు, ఏపీకి 8,407.98 టన్నులు సరఫరా చేశామన్నారు. అలాగే కర్నాటకకు 20,319.75 టన్నులు, మహారాష్ట్రకు 14,649.12, ఛత్తీస్‌‌గఢ్‌‌కు 13,526.37, తమిళనాడుకు 13,520.43, మధ్యప్రదేశ్‌‌కు 8,246.52 టన్నుల యూరియా సప్లై చేసినట్లు పేర్కొన్నారు.

పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడంలో కీలకంగా పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లను సీజీఎం అభినందించారు.