11,545 కేజీల గంజాయి కాల్చివేత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పలు పోలీస్​ స్టేషన్ల పరిధిలో సీజ్​ చేసిన దాదాపు రూ.28 కోట్ల విలువైన 11,545 కేజీల గంజాయిని గురువారం కాల్చివేసినట్లు  ఎస్పీ బి. రోహిత్​ రాజు తెలిపారు. హేమచంద్రాపురం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటిస్తూ డ్రగ్​ డిస్పోజల్​ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేసినట్టు ఆయన వివరించారు.

గంజాయి సేవించే వారితో పాటు రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రోగ్రాంలో ఏఆర్​ అడిషనల్​ ఎస్పీ విజయ్​ బాబు, ట్రైనీ ఐపీఎస్​ విక్రాంత్​ సింగ్, డీఎస్పీలు రెహమాన్, సతీశ్​కుమార్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్​పెక్టర్​ నాగరాజు పాల్గొన్నారు.