సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) RTI ప్రత్యుత్తరం ప్రకారం, గడువులోగా ఆధార్ కార్డులతో అనుసంధానించబడనందుకు 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్ అయ్యాయి. ఈ ఏడాది జూన్ 30తో పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు ముగిసింది. దేశంలో మొత్తం 70.24 కోట్ల మంది పాన్ కార్డు హోల్డర్లలో 57.25 మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. RTI సమాధానం ప్రకారం, 12 కోట్లకు పైగా పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానించలేదు. వాటిలో 11.5 కోట్ల కార్డులు డీయాక్టివేట్ చేయబడ్డాయి.
మధ్యప్రదేశ్‌లోని చంద్ర శేఖర్ గౌర్ అనే కార్యకర్త ఆర్టీఐ దాఖలు చేశారు. దరఖాస్తు చేస్తున్నప్పుడు పాన్‌కి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి కోసం ఆధార్ అండ్ పాన్ కార్డ్‌ల లింక్ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. అయితే జూలై 1, 2017న లేదా అంతకు ముందు కార్డ్‌ను కేటాయించిన పాన్ హోల్డర్‌లకు ఈ రెండింటినీ లింక్ చేయడం తప్పనిసరి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA సబ్-సెక్షన్ (2) ప్రకారం, జూలై 1, 2017న పాన్ కార్డును కేటాయించిన ప్రతి వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను తెలియజేయడం తప్పనిసరి అని RTI ప్రత్యుత్తరం నొక్కి చెప్పింది.
ALSO READ: బీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా పని చేయాలి: హుస్సేన్ నాయక్
"ఈ పాన్, ఆధార్ లింక్ చేయడం నోటిఫైడ్ తేదీకి లేదా అంతకంటే ముందు చేయవలసి ఉంటుంది. అది చేయలేకపోతే పాన్ పనిచేయదు" అని RTI సమాధానంలో తెలిపింది. పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవడానికి CBDT రూ. 1,000 జరిమానా విధించింది. CBDT 2022, మార్చి 30న పాన్, ఆధార్ కార్డ్‌లను నోటిఫై చేసిన తేదీకి లేదా అంతకు ముందు లింక్ చేయకపోతే వచ్చే చిక్కులను జాబితా చేసింది. ఇది రెండింటినీ లింక్ చేయడానికి గడువును జూన్ 2023 వరకు పొడిగించింది.