ప్రజావాణికి1,150 ఫిర్యాదులు

పంజాగుట్ట,వెలుగు : బేగంటపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 1,150 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఎస్సీ వెల్ఫేర్ 610, విద్యుత్, సింగరేణికి115, సివిల్ సప్లై 113, మైనారిటీ వెల్ఫేర్ 85,  రెవెన్యూ 69, ఇతర శాఖలకు158 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు మంజూరైనా ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వలేదని దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె. మహేశ్​అన్నారు. ప్రభుత్వం వెంటనే దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరారు.