
- కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జీఎం షాలెం రాజు తెలిపారు. ఏరియాలోని రుద్రంపూర్ జీఎం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోల్ ప్రొడక్షన్ వివరాలను తెలిపారు. జనవరి నెలలో 11.19లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గానూ 11.55లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామన్నారు. బొగ్గు రవాణా 17.44లక్షల టన్నులు కాగా, 12.96లక్షల టన్నులు చేశామన్నారు. వీకే ఓసీ ప్రారంభం కావాల్సి ఉందన్నారు.
జనవరి నెలలో పీవీకే–5 ఇంక్లైన్ 47శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా, కిష్టారం ఓసీ 125శాతం, జేవీఆర్ ఓసీ 101శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ ప్రెస్మీట్లో ఎస్వోటూజీఎం కోటిరెడ్డి, ఏజీఎం కె. హనసుమలత, ఏజీఎం రామకృష్ణ, పర్సనల్ మేనేజర్ శివకేశవరావు, డీజీఎం ఐఈడీ ఎన్.యోహాన్, ఏజెంట్ రవీందర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మణుగూరులో 82 శాతం..
మణుగూరు, వెలుగు : సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో జనవరి నెలలో 82 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం దుర్గం రామచందర్ తెలిపారు. బుధవారం జీఎం కాన్ఫరెన్స్ హాల్లో ఆయన ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్ వివరాలను వెల్లడించారు జనవరిలో మణుగూరు ఏరియా కు 11,18,100 టన్నుల టార్గెట్ కు 9,13,577 టన్నుల ప్రొడక్షన్ తీశామన్నారు. మణుగూరు ఏరియా నుంచి 19,14 ,654 టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు చెప్పారు.
ఓవర్ బర్డెన్ తొలగింపులో సంస్థ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అయినందుకు ఏరియా కార్మికులు, అధికారులను జీఎం అభినందించారు. కార్యక్రమంలో ఏజీఎం సివిల్ డి.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ ఎం.నర్సిరెడ్డి, సేఫ్టీ ఆఫీసర్ జె.వెంకటరమణ, డీజీఎంలు కే.వెంకట్రావు, ఎస్.రమేశ్, ఎం.అనురాధ, డీవైసీఎంఓ మేరీ కుమారి, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ జె.శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సింగు శ్రీనివాస్, షబ్బీరుద్దీన్, బాబుల్ రాజ్ పాల్గొన్నారు.