హైదరాబాద్ సిటీ, వెలుగు: వాస్కోడిగామా రైల్లో రూ.1.50 లక్షల విలువైన117 గోవా లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకుని, ఒకరిపై కేసు నమోదు చేశారు. గోవా నుంచి సిటీకి వస్తున్న రైల్లో అక్రమంగా ఎన్డీపీఎస్ మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో శనివారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 60 మంది వద్ద ఒకటి, రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జోసెఫ్ అనే వ్యక్తి వద్ద 15 మద్యం బాటిళ్లు ఉండడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.