
అబిడ్స్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోవాలని, రాంగ్ రూట్‌లో వెళ్లొద్దని, సిగ్నల్ జంప్ చేయొద్దని వాహనదారులను కోరుతుంటారు. తద్వారా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండొచ్చని అవగాహన కల్పిస్తుంటారు. రూల్స్ పాటించని వారికి చలానాలు వేస్తుంటారు. అయినా చాలా మంది నిబంధనలు పాటించరు. ఇలాంటి ఓ వ్యక్తి స్కూటీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఓ హోండా యాక్టివాను ఆపి పోలీసులు చెక్ చేయగా.. పదుల సార్లు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆ యాక్టివాకు ఏకంగా 117 చలాన్లు వేశారు. అలాగే దాదాపు రూ.30 వేల పెండింగ్ అమౌంట్ ఉండటంతో వాహనాన్ని అబిడ్స్ పోలీసులు సీజ్ చేశారు.