ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1178 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో 1155 మంది లోకల్స్ కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 22 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,179కి చేరింది.
గడిచిన 24 గంటల్లో భారీగా 13 మంది కరోనాతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కర్నూలులో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు మరణించారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల మరణించినవారి సంఖ్య 252కి పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 9,745 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 11,200 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు: