ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌లో 1.18 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌) లో ఆగస్టు నెలలో 1,18,335 మెట్రిక్‌‌‌‌ టన్నుల యూరియాను ఉత్పత్తి చేశామని ప్లాంట్‌‌  చీఫ్​ జనరల్‌‌‌‌ మేనేజర్‌‌‌‌ సుధీర్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఝా తెలిపారు. నీమ్‌‌‌‌ కోటెడ్‌‌‌‌  యూరియా ఉత్పత్తి చేశామని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. అందులో తెలంగాణకు 25,208.55 మెట్రిక్ టన్నులు, ఏపీకి 29,208.96 మెట్రిక్ టన్నులు, కర్నాటకకు 33,222.06 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 10,846.35 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌‌‌‌ గఢ్ కు 8,177.76 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 11,672.10  మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశామని ఆయన వివరించారు. 

ALSO READ :బియ్యం బస్తాలతో వెళ్తున్న లారీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు

ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులను ఆయన అభినందించారు. కాగా, ప్లాంట్‌‌‌‌లోని యూరియా ఉత్పత్తి జరిగేందుకు కీలకమైన హీట్‌‌‌‌ ఎక్సేంజర్‌‌‌‌లో ట్యూబ్‌‌‌‌  జాయింట్‌‌‌‌ లీకేజీ కావడంతో శుక్రవారం నుంచి షట్‌‌‌‌డౌన్‌‌‌‌  తీసుకున్నామని ఝా వెల్లడించారు. దీంతో వారం రోజుల పాటు యూరియా ఉత్పత్తి నిలిచిపోతుందని పేర్కొన్నారు.