న్యూ ఇయర్ హంగామా.. హైద్రాబాద్లో ఒక్క రాత్రికే 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..550 దాటిన బ్రీత్ అనలైజర్ టెస్టు

న్యూ ఇయర్ హంగామా.. హైద్రాబాద్లో ఒక్క రాత్రికే 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు..550 దాటిన బ్రీత్ అనలైజర్ టెస్టు

న్యూ ఇయర్ అంటే చాలు.. మద్యం ప్రియులకు పండగే పండగ. కొత్త ఏడాదికి స్వాగతం పలికే జోష్ లో మద్యం తాగి రోడ్డెక్కి పోలీసులకు పట్టుబడ్డారు. 2025 డిసెంబర్ 31 ఒక్క రాత్రిలో హైద్రాబాద్ లో డ్రంకెన్‌ డ్రైవ్‌ల కేసులు  హజార్‌ మార్క్‌ దాటేశాయి.  అర్థరాత్రి దాదాపు 11వందల 84 మందిపై కేసులు నమోదయ్యాయి. 

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ వాహనాలను ఆపీ తనిఖీలు నిర్వహించారు. న్యూ  ఇయర్ సెలబ్రేషన్స్ లో  భాగంగా రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా 1184 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

ఈస్ట్ జోన్ లో అత్యధికం:

హైద్రాబాద్ లో నమోదైన కేసుల వివరాలు జోన్‌ల వారిగా చూస్తే.. ఈస్ట్‌ జోన్‌లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్‌ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179 కేసులు, సౌత్‌ వెస్ట్ జోన్‌లో 179, నార్త్‌ జోన్‌లో 177, సెంట్రల్‌ జోన్‌లో 102 కేసులు నమోదయ్యాయి. 

బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో రీడింగ్ 550 పాయింట్స్:

డ్రంక్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా బ్రీత్ అనలైజర్ టెస్టులో రీడింగ్ లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో  ఓ వ్యక్తికి నిర్వహించిన టెస్ట్‌లో రీడింగ్ 550 పాయింట్స్ నమోదు కావడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో విధులు నర్వర్తిస్తున్న పోలీసులతో కొందరు వాగ్వాదానికి దిగారు. నాంపల్లిలో కొందరు ఆటోవాలాలు హంగామా సృష్టించారు. బ్రీత్ అనలైజర్ టెస్టులకు సహకరించకుండా గొడవకు దిగారు. 

జూబ్లీహిల్స్ లో డ్రగ్ టెస్టు.. ఒక వ్యక్తి పాజిటివ్:

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నార్కోటిక్స్ బ్యూరో అధికారుల డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. టీజీన్యాబ్ అధికారులు డ్రంక్ ఎండ్ డ్రైవ్ తో పాటు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు.  నాగార్జున రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. Mdma, గంజాయి సేవించినట్లు నిర్ధారించిన అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.