గుమ్మడిదల మండలంలో డంప్​యార్డ్​కు వ్యతిరేకంగా 1190 దరఖాస్తులు

గుమ్మడిదల మండలంలో డంప్​యార్డ్​కు వ్యతిరేకంగా 1190 దరఖాస్తులు

పటాన్​చెరు (గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంప్​యార్డు నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. 60 రోజులకు పైగా నల్లవల్లి, ప్యారానగర్, గుమ్మడిదల మండల జేఏసీ ఆధ్వర్యంలో డంప్​యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఈ నెల 3న డంప్​యార్డుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలపాలని గుమ్మడిదల తహసీల్దార్​ఆఫీసు ఆవరణలో కౌంటర్లను ఏర్పాటు చేశారు.

శుక్రవారం తమ అభిప్రాయాలను తెలిపేందుకు నల్లవల్లి గ్రామస్తులు వందల సంఖ్యలో తహసీల్దార్​ ఆఫీసుకు తరలి వచ్చారు.  ప్రజలంతా ఒక్కసారిగా రావడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్డీవో రవీందర్ రెడ్డి, అడిషనల్​ఎస్పీ సంజీవరావు నేతృత్వంలో  పోలీస్ బందోబస్తు మధ్య  అభిప్రాయాలను స్వీకరించారు. ఈ క్రమంలో ఒకే రోజు 1190 మంది డంప్​యార్డుకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను రాత పూర్వకంగా రెవెన్యూ అధికారులకు సమర్పించారు.