తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,003 శాంపిల్స్ పరీక్షించగా 1198 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఈ ఒక్క రోజే ఏడుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 46,274కి చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 422కి పెరిగింది. ఈ ఒక్క రోజులో 1885 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 34,323కి చేరింది. ప్రస్తుతం 11,530 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 510 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 106, కరీంనగర్లో 87, మేడ్చల్ జిల్లాలో 76, వరంగల్ అర్బన్‌లో 73, మహబూబ్‌నగర్ జిల్లాలో 50 మంది చొప్పున కరోనా బారినపడ్డారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా రికవరీ రేటు 74 శాతానికి పెరిగిందని, మరణాల రేటు 0.91 శాతానికి తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 14,959 బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 20.07.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/p54dJblZJO
— Eatala Rajender (@Eatala_Rajender) July 20, 2020