గుడిపేట మౌంట్ కార్మెల్ హై స్కూల్ లో..11వ ఇంటర్ కార్మెల్ స్పోర్ట్స్ మీట్ 2025

మంచిర్యాల, వెలుగు: గుడిపేట మౌంట్ కార్మెల్ హై స్కూల్ లో  11వ ఇంటర్ కార్మెల్ స్పోర్ట్స్​  మీట్ 2025 ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10,11తేదీలలో తెలంగాణ ప్రాంతంలో గల  అన్ని కార్మెల్ స్కూల్స్న  విద్యార్థులు  పోటీల్లో  పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫాదర్ జోష్, 13వ బెటాలియన్ కమాండెంట్​ వెంకట రాములు, హాజీపూర్ తహసీల్దార్ దేశ్ పాండే శ్రీనివాస్ పాల్గొన్నారు. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా  పోటీల్లో  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూళ్ల ప్రిన్సిపాల్స్ సిస్టర్ ఆల్ఫీ, రినైట్, రిన్సీ, లిస్సల్, లిస్బబెత్, జ్యోతి, సాబస్య తదితరులు పాల్గొన్నారు.