
ముంబై: పదేండ్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌తో ముందుకు రానుంది. కొత్త సీజన్ అక్టోబర్ 18న హైదరాబాద్‌వేదికగా ప్రారంభం కానుందని లీగ్‌ఆర్గనైజర్ మషాల్ స్పోర్ట్స్ మంగళవారం ప్రకటించింది. ఈ సీజన్‌ను తిరిగి మూడు సిటీల కారవాన్‌ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. తొలి అంచె హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని తెలిపింది. నవంబర్ 10 నుంచి నోయిడాలో రెండో అంచె, డిసెంబర్ 3 నుంచి పుణెలో మూడో దశ జరుగుతుందని ప్రకటించింది.