- కాంగ్రెస్ వచ్చాక దావోస్‌లో ఐదింటికి ఒప్పందాలు
- ఇంకో రెండు ప్రతిపాదనలకు పర్మిషన్లు ఇవ్వలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అదానీ గ్రూప్ మొత్తం 12 ప్రాజెక్టులకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో ఐదు ఒప్పందాలు గత బీఆర్ఎస్ప్రభుత్వంలో జరిగి అనుమతులు రాగా.. ఇంకో ఐదు ఒప్పందాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదిరాయి. ఇంకో రెండింటికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అదానీ గ్రూపులకు సంబంధించిన పెట్టుబడులు, ఒప్పందాల వివరాలను సోమవారం వెల్లడించింది. ఇందులో మామిడిపల్లిలో అదానీ ఎల్బీట్సిస్టమ్స్డిఫెన్స్ యూనిట్ కు బీఆర్ఎస్ హయాంలో అనుమతి ఇచ్చారు. ఇది ఇండియన్ఆర్మీ, నేవీకి సంబంధించిన డ్రోన్స్ ప్రొడక్షన్‌కు సంబంధించినది. ప్రస్తుతం ఇది ఆపరేషన్‌లో ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇదే మామిడిపల్లిలో మిసైల్ షెల్‌కు సంబంధించిన యూనిట్ నిర్మాణంలో ఉండగా, దీనికి కూడా గత ప్రభుత్వంలోనే ఒప్పందం కుదిరింది. ఎల్లికట్ట దగ్గర పూర్తయిన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫేజ్1తో పాటు మూడు నేషనల్ హైవే ప్రాజెక్టులకు బీఆర్ఎస్ హయాంలో అనుమతి ఇచ్చారు. ఈ హైవేలలో రెండు పూర్తి కాగా ఇంకొకటి కొనసాగుతున్నది. ఖమ్మం నుంచి సూర్యాపేట, మంచిర్యాల నుంచి రేపల్లేవాడకు పూర్తి కాగా, ఖమ్మం నుంచి కోదాడ నేషనల్ హైవే నిర్మాణం 85 శాతం పూర్తయింది. ఇక 750 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ వడోదర, వరంగల్, కర్నూల్, చిలకలూరిపేట ప్రాజెక్టుకు కూడా బీఆర్ఎస్ హయాంలో ఒప్పందం కుదరగా.. అది కూడా పూర్తయింది.
కాంగ్రెస్ ఇచ్చినవివీ..
చందనవెల్లిలో డేటా సెంటర్ టెక్ పార్క్‌కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందుకు 49 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటికే 34.8 ఎకరాలు సేకరించారు. మిగతా భూసేకరణ కొనసాగుతున్నది. రామన్నపేటలో లాజిస్టిక్స్ పార్క్ అండ్ డ్రైపోర్ట్ కోసం భూసేకరణ జరిగింది. మొత్తం 375 ఎకరాలు సేకరించారు. ఇతర ఇన్సెంటివ్ ల కోసం ప్రతిపాదనలు వెళ్లగా అనుమతి పెండింగ్‌లో ఉన్నది. 5 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ప్రాజెక్టుకు దావోస్‌లో కాంగ్రెస్ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ల్యాండ్అలాట్మెంట్, ఇతరత్రా పెండింగ్‌లో ఉన్నాయి. రామన్నపేటలో 6 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్యూనిట్కు దావోస్‌లోనే ఒప్పందం కుదిరింది. దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. కొడంగల్‌లో 9 మిలియన్ టన్నుల సిమెంట్ప్లాంట్ఏర్పాటుకు సంబంధించి ఇప్పుడున్న ప్రభుత్వానికి అదానీ కంపెనీ నుంచి ప్రతిపాదనలు అందాయి. కాగా, కౌంటర్ డ్రోన్ ఉత్పత్తికి సంబంధించిన యూనిట్ కోసం అదానీ గ్రూప్ ప్లాన్ చేసింది. 2025లో మామిడిపల్లిలోనే ఇంకో 25 ఎకరాల్లో విస్తరించాలని అనుకుంటున్నట్టు ప్రతిపాదనలు వచ్చాయి. అయితే దీనికి ప్రభుత్వం నుంచి అనుమతులు ఇంకా రాలేదు. ముచ్చర్లలో డేటా సెంటర్కాంప్లెక్స్కోసం కూడా ప్రతిపాదనలు పంపింది. దీనికి 100 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనికి కూడా అనుమతి లభించలేదు.